బాలీవుడ్ లో నెపొటిజం మీద ఎన్ని వార్తలు వచ్చినా సరే సినీ వారసుల తెరంగేట్రం జరుగుతూనే ఉంటుంది.ఇప్పటికే స్టార్ వారసుల హవాతో బాలీవుడ్ సత్తా చాటుతుంటే కొత్తగా మరో సినీ వారసురాలు తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఈసారి ఎంట్రీ ఇచ్చేది ఎవరు అంటే.స్టార్ హీరో.
స్టార్ హీరోయిన్ పేరెంట్స్ ఇద్దరు గొప్ప నటులు కాగా వారి గారాల పట్టిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టబోతుంది నైసా దేవగన్.అజయ్ దేవగన్, కాజోల్ ల కూతురైన నైసా త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతుందని ముంబై మీడియా టాక్.
అమెరికాలో చదువు పూర్తి చేసిన అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ లో ఈవెంట్స్ దగ్గర తన హంగామా చేస్తుంది.హీరోయిన్ అవ్వకముందే సినీ సర్కిల్స్ తో టచ్ లో ఉంటూ అక్కడ పార్టీల్లో పాల్గొంటుంది నైసా.
స్టార్ తనయురాలిగా తన ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.కాజోల్ ఇప్పటికే కూతురు కోసం కథల వేట మొదలు పెట్టిందట.మొత్తానికి బాలీవుడ్ తెర మీద మరో నట వారసురాలిని చూడబోతున్నాం.మరి నైసా ఎలాంటి సినిమాతో తెరంగేట్రం చేస్తుందో చూడాలి.