ప్రవాసులకు మరో షాక్....అత్యధిక వేతనాలు ఉంటేనే ఫ్యామిలీ వీసా...!!

ప్రవాసులకు మామూలు షాకులు ఇవ్వడం లేదు అరబ్బు దేశమైన కువైట్రోజుకో రూల్ పెడుతూ అల్లడించేస్తోంది.నేరుగా పొమ్మనలేక పొగలు పెడుతూ బయటకు పోయేలా చేస్తోంది.

ఇతర దేశాల ముందు తమను వేలెత్తి చూపించుకోకుండా ప్రవాసులు వారంతట వారే మాకొద్దీ కువైట్ అనుకునేలా వారి వారి దేశాలకు వెళ్లి పోయేలా చేస్తోంది.స్థానికులకే ఉద్యోగాలు కట్టబెట్టాలని నిర్ణయించుకున్న కువైట్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

మరో రెండేళ్ళ లో కువైట్ లో స్థానికులు తప్ప ప్రవాసులు కీలక ఉద్యోగాలలో ఉండకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది.తాజాగా.

కండిషన్ అప్లై అంటూ మరో నిభందనను తెరమీదకు తీసుకువచ్చింది.తమ దేశంలో ప్రవాసులకు ఇచ్చే అన్ని రకాల వీసాలపై ఆంక్షలు పెడుతూ వచ్చిన కువైట్ తాజాగా డిపెండెంట్, ఫ్యామిలీ వీసాలపై కొత్త మెలిక పెట్టింది.

Advertisement

ఈ రెండు కేటగిరీ వీసాలను కొంత కాలం పాటు నిలిపివేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించిన కువైట్ ఈ వీసాల జారీలో భారీ మార్పులు తీసుకురానుందట.అంటే ప్రవాసులు ఎవరైనా సరే ఈ వీసా జోలికి రాకుండా కట్టడి చేస్తోంది.

ఇంతకీ వీసాల విషయంలో పెట్టిన రూల్స్ ఏంటంటే.

ఆర్టికల్ 22 ప్రకారం ఫ్యామిలీ, డిపెండెంట్ వీసాలు కలిగిన వారు ఎవరైనా సరే గతంలో వారి సాలరీ పరిమితి రూ.1.28 లక్షలుగా ఉండేది అయితే ఇప్పుడు ఈ పరిమితిని అమాంతం పెంచేశారు.ఇప్పుడు సాలరీ పరిమితి రూ.2 లక్షలు ఉంటేనే ఈ వీసాలను పొందేందుకు అర్హులుగా చేసింది.ప్రభుత్వ, ప్రవైటు రంగాలో ఉన్న ఉద్యోగులు ఎవరైనా సరే ఆర్టికల్ 17, 18 కింద వీసా కలిగి ఉంటే వారికి ఈ నిభందన వర్తిస్తుందట.

ఈ వీసాలను పొందేందుకు వారు తప్పనిసరిగా పెంచిన జీతాన్ని పొందుతున్నట్టుగా తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు