ఏపీలో మరో సంచలనం ..ఆ లెక్కలు తేల్చే పనిలో ప్రభుత్వం

ఏపీలో వైసిపి( YCP ) అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో సంచలనాలకు నాంది పలుకుతూనే ఉంది.

ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో సర్వేకు శ్రీకారం చుట్టింది.

ఏపీలో ప్రజల కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని పైన సర్వే చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.పది రోజుల్లోనే ఈ సర్వేను పూర్తి చేసే విధంగా విధి విధానాలను రూపొందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కుల, గ్రామీణ సర్వేలు( Caste Survey ) ప్రభుత్వం మొదలు పెట్టింది.గ్రామ, వార్డు, సచివాలయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న కోటి 60 లక్షల కుటుంబాలను సర్వే చేయనున్నారు.

దీనికోసం వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణను అధికారులు ఇచ్చారు.ఎక్కడా ఎటువంటి వ్యక్తిగత డేటా బయటకు వెళ్ళకుండా, అత్యంత పగడ్బందీగా ఈ సర్వే చేపట్టే విధంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

ఇంటింటి సర్వేలో భాగంగా రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

మొదటి దశలో గ్రామ, వార్డు వాలంటీర్లు ( Volunteers )వారికి ఇచ్చిన సి ఎఫ్ ఎమ్మెస్ లాగిన్ ద్వారా యాప్ లో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు.ఆ కుటుంబం ప్రాథమిక వివరాలైన జిల్లా పేరు, మండలం, వార్డు, ఇంటి నెంబర్ వంటి వివరాలను తీసుకుంటారు.ఆ తర్వాత కుటుంబ పెద్ద పేరు, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డు నెంబర్, ఇంటి రకం , నీటి సౌకర్యం, గ్యాస్ సదుపాయం, పశు సంపద ఇలా అన్నిటి సమాచారాన్ని సేకరిస్తారు.

ఆ తరువాత సెక్షన్ లో కులం, మతం, వృత్తి, పంట భూమి, నివాస భూమి వంటి వివరాలను సేకరిస్తారు.మొత్తం 723 కుటుంబాలకు సంబంధించి ఓసి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలుగా విభజిస్తారు.

జనవరి 19 నుంచి 28 వరకు పది రోజులు పాటు వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేయించనున్నారు.వాలంటీర్లు ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా అందుబాటులో లేకపోతే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు దగ్గరలోని సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది.మొత్తం ఈ ప్రక్రియను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు