అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న మహేష్, బన్నీ!

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు,అల్లు అర్జున్ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో సినిమాలకు సంబంధించిన విశేషాలను, ఇతర విషయాలను పంచుకునే మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ లో 6 మిలియన్ క్లబ్ లో చేరారు.

 Another Rare Records In Mahesh Babu And Allu Arjun Career, Allu Arjun Buttamomma-TeluguStop.com

అక్షరాలా 60 లక్షల మంది మహేష్ బాబును ఇన్‌స్టాగ్రామ్‌ లో ఫాలో అవుతున్నారు.చాలా తక్కువ సమయంలోనే మహేష్ బాబు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం.

మహేష్ బాబు

ఈ రికార్డును సొంతం చేసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇన్‌స్టాగ్రామ్‌ తో పాటు ట్విట్టర్ లో కూడా మహేష్ బాబు హవా కొనసాగుతోంది.ట్విట్టర్ లో మహేష్ కు 10.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం.ఈఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ జనవరి నుంచి సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తోంది.

Telugu Allu Arjun, Buttabomma, Mahesh Babu, Mahesh Instram, Rare-Movie

మరోవైపు బన్నీ ఖాతాలో సైతం రేర్ రికార్డ్ నమోదైంది.అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు యూట్యూబ్ లో 450 మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఈ సినిమాలోని రాములో రాములా పాటకు కూడా 250 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

థమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురములో పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ గా కనిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube