అమెరికాలో జాతివివక్ష దాడి అనగానే గుర్తుకొచ్చేది జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతమే.ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ట్రంప్ హయాంలో అతడికి మాయని మచ్చగా ఈ ఘటన మారింది.అంతేకాదు అధ్యక్షుడిగా అతడిపై తీవ్ర వ్యతిరేకత కలగడానికి గల కారణాలలో ఈ సంఘటన కూడా ఒకటి.
అయితే ఈ జాత్యహంకార దాడికి కారణమైన వారిని ప్రభుత్వం అరెస్ట్ చేసి జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించింది అయితే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తానని హామీ ఇచ్చారు బిడెన్.
అయితే బిడెన్ అధికారంలోకి వచ్చినా కూడా నల్లాజాతీయులపై దాడులు మాత్రం ఆగలేదు.బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడక్కడా దాడులు జరిగినా మృతి చెందిన ఘటనలు నమోదు కాలేదు.
కాని ఏప్రియల్ లో జార్జ్ ఫ్లాయిడ్ తరహా జాత్యహంకార హత్య చోటు చేసుకుంది.అమెరికాలోని రాపిడ్స్ నగరంలో ఓ నల్లజాతి వ్యక్తి కారులో వెళ్తున్న క్రమంలో అతడిని ఆపిన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ చూపమని అడిగారు ఈ క్రమంలో వారి మధ్య జరిగిన గొడవలో పోలీసులు అతడి తలపై షూట్ చేసి చంపేశారు.
ఈ ఘటనపై ప్రస్తుతం నిరసనలు తెలియజేస్తున్నారు నల్లజాతీయులు.కాగా తాజాగా అమెరికాలో మరో సంఘటన చోటు చేసుకుంది.
చిప్స్ ప్యాకెట్లు దొంగిలించాడనే కారణం చూపి 7 ఏళ్ళ నల్లజాతి బాలుడిపై న్యూయార్క్ పోలీసులు జులుం చూపించారు.ఆ పిల్లాడి చేతులు వెనక్కి పెట్టి అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును ఓ వ్యక్తి వీడియోలో భందించాడు.
అతడు చేసిన నేరం ఎంటి అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి సదరు పోలీసును అడుగగా చిప్స్ ప్యాకెట్ ను దొంగిలించాడని అందుకే ఇలా అంటూ సమాధానం చెప్పడంతో షాక్ అయిన అతడు ఆ డబ్బులు నేను ఇస్తాను అతడిని వదిలేయమని కోరడంతో పిల్లాడిని వదిలేసాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ రాష్ట్ర గవర్నర్ స్పందించారు.
ఈ ఘటన ఎంతో భాధాకరం తప్పకుండా పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.అయితే కమలా హారీస్ తమ ప్రతినిధిగా అధికారంలో ఉన్నారని కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తమపై జరుగుతున్న దాడులపై ఏ మాత్రం స్పందించడం లేదని నల్లజాతీయులు వాపోతున్నారు.







