రష్మీ మరో గ్లామర్‌ షో

జబర్దస్త్‌ యాంకర్‌ రష్మీ ఇటీవల ‘గుంటూర్‌ టాకీస్‌’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో రష్మీ నటించింది తక్కువ, గ్లామర్‌ చూపించింది ఎక్కువ.

 Another Glamour Show From Rashmi-TeluguStop.com

ఆ చిత్రంలో రష్మీకి కేవలం స్కిన్‌ షోకే అవకాశం దక్కింది.హాట్‌ హాట్‌ లిప్‌ లాక్‌లతో పాటు, దుమ్ము రేపే రొమాంటిక్‌ సీన్స్‌లతో ‘గుంటూర్‌ టాకీస్‌’ చిత్రంను హీట్‌ ఎక్కించింది.

ఆ సినిమా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకుని, రష్మీ కష్టానికి ఫలితం దక్కింది.ఇక రష్మీ మరోసారి తన అందాలను చూపించేందుకు సిద్దం అవుతోంది.

రష్మీ హీరోయిన్‌గా ‘అంతం’ అనే చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.

ఈలుక్‌లో రష్మీ హాట్‌ హాట్‌గా ఉండి ఆకట్టుకుంటుంది.పోస్టర్లను బట్టి చూస్తే ఇదో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అని తెలుస్తోంది.

సోలోగా రష్మీ తన అందాలను దుమ్ము రేపడం ఖాయం అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.ఒక హర్రర్‌, సస్పెన్స్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

యూత్‌ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను వేసవి చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటున్నారు.ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు రష్మీ కూడా ఫుల్‌ హ్యాపీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు