ఎన్ని చట్టాలు చేసినా దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన ముంబైలో వెలుగుచూసింది.
నగరంలోని సకినాక ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 34 ఏళ్ల ఓ మహిళ ఆగివున్న టెంపో లో అత్యాచారానికి గురైంది.నిర్భయ ఘటనకు కల్పించేలా ఆమెపై అత్యాచారం జరిగింది.
మానవ మృగాళ్లు అంతటితో ఆగకుండా ఇనుపరాడ్లతో చిత్రహింసలకు గురిచేశారు.అత్యాచారంపై తెల్లవారుజామున 3:30 గంటలకు కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు రక్తపుమడుగులో పడివున్న బాధ్యతరాలిని గుర్తించారు.స్థానిక రాజవాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు మోహన్ చౌహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అతని పై అత్యాచారం, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచారు.
నిందితుడికి ఈనెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది.ఘటనా స్థలం నుంచి తీసుకున్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు భద్రపరిచారు.
టెంపో లోపల రక్తపు మరకలను ఉన్నట్లు గుర్తించారు.మహిళలపై అత్యాచార ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఇటువంటి ఘటనలు సమాజానికి సిగ్గుచేటని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ ద్వారా దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేసారు.
ఇదిలా ఉండగా నిర్భయ తరహా లో జరిగిన అత్యాచారం, హత్య పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.దారుణమైన ఈ ఘటనలో అనాగరికమైనదిగా అభివర్ణించింది.
తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించింది.