డైరెక్టర్ సుజీత్ సింగ్.ఈయన తెలుగు ప్రేక్షకులకు అందరికి సుపరిచితమే.
సుజీత్ రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సుజీత్ ఆ తర్వాత రెండవ అవకాశంగా ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం కూడా అందుకుని అప్పట్లో సంచలనం క్రియేట్ చేసాడు.
సుజీత్ ను ముందు నుండి నమ్మింది ఎవరు అంటే యూవీ ప్రొడక్షన్స్ వారు అనే చెప్పాలి.రన్ రాజా రన్ సినిమాతో ఈ నిర్మాణ సంస్థల్లోకి ఎంటర్ అయిన ఈ యంగ్ డైరెక్టర్ ను నమ్మింది మాత్రం ఈ సంస్థనే.
యూవీ వారే ప్రభాస్ తో సుజీత్ ను కలిపి సాహో సినిమాను నిర్మించారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
అయిన కూడా ఈ యంగ్ డైరెక్టర్ టాలెంట్ కు చాలా మంది ఫిదా అయ్యారు.సాహో డిజాస్టర్ తర్వాత సుజీత్( Sujeeth ) లాంగ్ గ్యాప్ తీసుకుని ఏకంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ‘ఓజి‘ సినిమాను ప్రకటించాడు.
భారీ డిజాస్టర్ తీసినప్పటికి ఈయన తన టాలెంట్ తో ఎట్టకేలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేసాడు.ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో సుజీత్ బిజీగా ఉన్నాడు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉండగా సుజీత్ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే హోంబలే ఫిలిమ్స్( Hombale Films ) బ్యానర్ వారు సుజీత్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యారని.ఇప్పటికే సుజీత్ అడ్వాన్స్ కూడా అందుకున్నట్టు చెబుతున్నారు.మరి ఈ కాంబోలో నటించబోయే స్టార్ హీరో ఎవరో ముందు ముందు తెలియాల్సి ఉంది.మరి కేజిఎఫ్, కాంతారా వంటి సూపర్ హిట్ సినిమాలతో భారీ లాభాలను అందుకున్న ఈ సంస్థ సుజీత్ తో ఎలాంటి మూవీ తీయబోతుందో ఎదురు చూడాల్సిందే.







