హైదరాబాద్ లో మరో బెగ్గింగ్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ నగరంలో మరో బెగ్గింగ్ రాకెట్ ను పోలీసులు గుట్టు రట్టు చేశారు.

ట్రాన్స్ జెండర్స్ ముసుగులో ప్రజలను వేధిస్తున్న బెగ్లర్లు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరంతా నకిలీ ట్రాన్స్ జెండర్లుగా పోలీసులు గుర్తించారు.సికింద్రాబాద్, ప్యారడైజ్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్లలో భిక్షాటన చేస్తున్నట్లు నిర్ధారించారు.

ఈ క్రమంలోనే నకిలీ ట్రాన్స్ జెండర్లతో పాటు ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.బీహార్ కు చెందిన ఈ ముఠా బెగ్గింగ్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా ఈ క్రమంలోనే నిన్న వృద్ధులతో బిక్షాటన చేయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు