ఏపీలో మరో అమానుషం.. ఈ సారి ఏకంగా బాలింతపైనే కామాంధుల దాడి ap, rape

ఏపీలో రోజురోజుకూ మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి.కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ చాలా దారుణ ఘటనలు జరిగాయి.

 Another Atrocity In Ap , Ap , Rape , Government, Police Apparatus, Vijayawada,-TeluguStop.com

ఈ దారుణాలను ఆపేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి సఫలం కావడం లేదు.ఏపీలో విజయవాడ, రేపల్లె ఘటనలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

ఆరోపణలు, ప్రత్యారోపణలతో అంతా సతమతమయ్యారు.ఈ ఘటనలను మరువకముందే ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో మరో ఘటన జరిగింది.

ఈ ఘటన గురించి తెలిస్తే ఎవరికైనా సరే ఒళ్లు గగుర్పొడుస్తుంది.అంతలా అమానుషంగా ప్రవర్తించారు కొంత మంది ఈ ఘటనలో.

మనుషులు కాదు మృగాళ్లు అనేలా వారి ప్రవర్తన ఉండింది.

జిల్లాలోని కనగాపల్లి మండలానికి చెందిన ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.

అలా సామూహికంగా అత్యాచారం చేసి ఆ దుండగులు ఆ వివాహితను దారుణంగా చంపేశారు.ఆ వివాహిత బాలింత కావడం గమనార్హం.

బాలింత అనే కనికరం కూడా లేకుండా వారు వ్యవహరించిన తీరు అందరి చేత కంట తడి పెట్టిస్తోంది.ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన 7 నెలల బాలింతను చెరిపేసి కొంత మంది కామాంధులు పాశవిక ఆనందం పొందారు.

ఆ బాలింత మీద అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా ఆమెను అనంతరం దారుణంగా హత్య చేశారు.కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తి ఎన్ని గంటలైనా ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చి చుట్టు పక్కల వెతికారు.

తెలిసిన వాళ్లను ఆరాతీశారు.ఇలా చుట్టూ వెతుకున్న సందర్భంలో చిధ్రమైన స్థితిలో ఆ బాలింత మృతదేహం వారికి కనిపించింది.

దీంతో ఒక్కసారిగా వారు షాక్ కు గురయ్యారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

బాలింతను చంపేముందు ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube