నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో సంతోష్ శోభన్(Santosh Shoban) , మాళవిక నాయక్(Malavika Nayar) జంటగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే (Anni Manchi Shakunamule) .ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ నందిని రెడ్డి సినిమా గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా నందిని రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కథ విక్టోరియాపురం అనే ఊరి కథ.ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏంటి అని విషయంపై ఈ కథ మొత్తం కొనసాగుతుందని తెలియజేశారు.

ఇక ఇప్పటివరకు తన డైరెక్షన్లో వచ్చిన అన్ని సినిమాలలో కల్లా బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాకు రాసానని తెలిపారు.ఈ సినిమా చివరి 20 నిమిషాల పైనే నా కెరియర్ మొత్తం ఆధారపడి ఉందని ఈ సందర్భంగా నందిని రెడ్డి తెలియజేశారు.రచయిత లక్ష్మీ భూపాల్ నాకు తమ్ముడు లాంటివారు ఎమోషనల్ సీన్స్ చాలా అద్భుతంగా రాస్తారని తెలిపారు.ఈ సినిమాకు సంగీత దర్శకుడు మిక్కీనే సోల్ ఈ కథ చెప్పినప్పుడు నువ్వే నా సూపర్ స్టార్ అని చెప్పాను క్లైమాక్స్ రాసేటప్పుడు ఆ సన్నివేశానికి అనుగుణంగా సంగీతం అందించారంటూ ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి నందిని రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







