తమిళనాడు జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సాంస్కృతిక వారసత్వానికి జల్లికట్టు చిహ్నమని చెప్పింది.
వారసత్వ పరిరక్షణకు చట్టాలు చేసే అధికారం తమిళనాడు రాష్ట్రానికి ఉందని న్యాయస్థానం తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో ఎటువంటి లోపం లేదని పేర్కొంది.
ఈ నేపథ్యంలోసాంస్కృతిక వారసత్వంపై నిర్ణయం తీసుకోవడంలో చట్ట సభలదే తుది నిర్ణయమని న్యాయస్థానం ప్రకటించింది.ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది.







