అసలే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది.దీంతో ఎవరి ద్వారా అయితే ఎక్కువ ఓట్లు రాలుతాయో వారికి అకస్మాత్తుగా ప్రాధాన్యం పెరిగిపోతుంది.
ఈ విషయంలో అన్ని పార్టీలది అదే దారి.ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా ఇదే విధంగా ముందుకు వెళుతున్నట్టు గానే కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నందమూరి అభిమానుల అండదండలు పూర్తిగా తమ పార్టీకి ఉండేలా చూసుకుంటున్నాయి.ఈ మేరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరుతో ఎన్టీఆర్ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఈనెల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు( NTR centenary celebrations ) హైదరాబాద్ లో జరగనున్నాయి.

ఈ ఉత్సవాలకు హాజరు కావలసిందిగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఎన్టీఆర్ తో పాటు బిజెపిలో ఉన్న దగ్గుపాటి పురందరేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు లను కూడా కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఇక అంతకుముందే జరిగిన విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి రజనీకాంత్ ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయ్యింది.
ఈ సందర్భంగా రజనీకాంత్ చంద్రబాబును ఉద్దేశించి ప్రశంసలు కురిపించడంపై వైసీపీ( YCP ) రజనీకాంత్ ను టార్గెట్ చేసుకోవడం, రజిని అభిమానులు వైసీపీపై విమర్శలు చేయడం, వంటివి టిడిపికి బాగానే లబ్ధి చేకూర్చాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ చంద్రబాబు అదే రాజకీయానికి తెర తీస్తారని, చంద్రబాబుకు( Chandrababu ) టిడిపికి వీలైనంత దూరంగా ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.
దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna ) బతికున్నప్పుడే చంద్రబాబు ఆయనను పక్కన పెట్టడం, రాజకీయంగాను ప్రాధాన్యం తగ్గించడం వంటివి జరిగాయి.

ఇక హరికృష్ణ మృతి చెందిన తర్వాత దానిని రాజకీయంగా వాడుకునేందుకు బాబు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి.అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపికి చంద్రబాబుకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు ఇక లోకేష్ పాదయాత్ర సమయంలోను వివిధ పర్యటనలలోను జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడం, కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టిడిపి బాధ్యతలు ఎన్టీఆర్ కు అప్పగించాలనే డిమాండ్ చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేసుకుని ఆయన అభిమానులను తమ వైపుకు తిప్పుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
దీనికోసమే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.దీంతో ఈనెల 20 న జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈనెల 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.ఆ రోజు ఆయన ముందుగానే మాల్దీవులు ట్రిప్ పెట్టుకున్నారు .ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.







