అక్కడ చికెన్ బిర్యానీ ధర కేవలం రూ.2 మాత్రమే.. అదనంగా గుడ్డు ఫ్రీ..!

టీడీపీ నేత, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే హిందూపురంలో అతని సతీమణి వసుంధర నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే నెల చివరి రోజుల్లో అన్న క్యాంటీన్‌ను లాంచ్ చేశారు.

ఆ సమయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఉచితంగా భోజనం అందిస్తూనే ఉంది నందమూరి కుటుంబం.అయితే ఇలా అన్న కాంటీన్ ద్వారా భోజనం అందించడం స్టార్ట్ చేసి సెప్టెంబర్ 4 వ తేదీకి వంద రోజులు పూర్తయ్యింది.ఈ ప్రత్యేక రోజున బాలకృష్ణ స్పెషల్ ఫుడ్‌ను రూ.2కే ఆఫర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.అనుకున్నదే తడవుగా ఆదివారం రోజు బిర్యానీ, చికెన్, గుడ్డు, స్వీట్‌ వంటి చక్కటి భోజనాన్ని అన్న క్యాంటీన్ ద్వారా కేవలం రూ.2కే అందించారు.ఒక హిందూపురం లోనే కాదు చాలా చోట్లా తక్కువ ధరలకే ఆహారం అందించే అన్నా క్యాంటీన్లు వెలిశాయి.

అమెరికాలో నివసిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.ఇక తాను ఓపెన్ చేసిన అన్న క్యాంటీన్ వంద రోజులు పూర్తి చేసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వసుంధర పేర్కొన్నారు.

ఎన్టీఆర్ కోడలి అయినందుకు తాను ఎంతగానో గర్విస్తున్నానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె హిందూపురాన్ని నందమూరి పురం అని అభివర్ణించడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

ఇక బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘ఎన్టీఆర్ ఆరోగ్య రథం’ కూడా ప్రారంభించారు.రూ.40 లక్షల బడ్జెట్‌తో ఎన్టీఆర్‌ ఉచిత ఆరోగ్య రథం కింద 200కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లో నిర్వహిస్తారు.నందమూరి కుటుంబం అందిస్తున్న ఈ సేవలకు ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు.

రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..
Advertisement

తాజా వార్తలు