మనలో చాలామంది ఎక్కువగా ఉపయోగించే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లలో షేర్ చాట్( ShareChat ) ఒకటి.షేర్ చాట్ యాప్ గురించి తెలిసినా ఈ యాప్ సీఈవో అంకుష్ సచ్ దేవా( ShareChat CEO Ankush Sachdeva ) గురించి చాలామందికి తెలియకపోవచ్చు.
సక్సెస్ సాధించే విషయంలో 17 సార్లు అంకుష్ కు చేదు అనుభవాలు ఎదురైనా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ అంకుష్ ఈ స్థాయికి చేరుకున్నారు.ప్రస్తుతం అంకుష్ ఆస్తుల విలువ 40,000 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
రేయింబవళ్లు తీవ్రంగా శ్రమించడం వల్లే అంకుష్ కు ఈ స్థాయిలో సక్సెస్ దక్కింది.
లక్ష్యం కోసం ఎంతో కష్టపడిన అంకుష్ లక్ష్య సాధనలో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకున్నారు.2015 సంవత్సరంలో షేర్ చాట్ యాప్ ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ యాప్ దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉంది.ఈ యాప్ కు ముందు 17 స్టార్టప్ లను మొదలుపెట్టిన అంకుష్ ప్రతి స్టార్టప్ విషయంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు.
షేర్ చాట్ యాప్ విషయంలో అంకుష్ కు అతని ఇద్దరు ఐఐటీ స్నేహితులు సహాయసహకారాలు అందించారు.అంకుష్ సచ్ దేవా 1982 సంవత్సరంలో ఘజియాబాద్( Ghaziabad ) లో జన్మించారు.
2011లో ఐఐటీ కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన అంకుష్ 2015 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్( Microsoft ) లో శిక్షణ పొందారు.షేర్ చాట్ మెయిన్ ఆఫీస్ బెంగళూరులో ఉండగా ప్రస్తుతం అంకుష్ సీఈవోగా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.షేర్ చాట్ యాప్ కు 350 మిలియన్ల కంటే మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.ఈ సంస్థలో ప్రస్తుతం 2500 మంది ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది.షేర్ చాట్ విలువ 5 బిలియన్ డాలర్లు కాగా అంకుష్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.