ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని( Mylavaram Constituency ) ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్ల పదవీకాలం రెన్యువల్ ను వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) నిలిపివేసింది.గత నెల 31వ తేదీతోనే 28 మంది పీఏసీఎస్ ఛైర్మన్ల( PACS Chairmen ) పదవీకాలం ముగిసింది.
అయితే ఇవాళ నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( MLA Vasantha Krishnaprasad ) తన అనుచరులతో నిర్వహించిన సమావేశానికి పీఏసీఎస్ ఛైర్మన్లు కూడా హాజరయ్యారు.ఈ సమాచారంతోనే వారి పదవీకాలం కొనసాగింపును వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని తెలుస్తోంది.
మరోవైపు గత నాలుగున్నరేళ్లుగా తనకు వైసీపీ అధిష్టానం సహకరించడం లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన క్యాడర్ కు వివరించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో పాటు మరి కొంత మంది నియోజకవర్గానికి చెందిన నేతలు పార్టీకి రాజీనామా చేస్తామని వసంతకు తెలిపారని సమాచారం.