మహేష్ బాబు ని జంతువు కంటే క్రూరంగా చూపిస్తాను - సందీప్ వంగ

‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సందీప్ వంగ( Sandeep Vanga ) చేసిన చిత్రం ‘ఎనిమల్’.ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో జరపబోతున్నారు.

 Animal Movie Director Sandeep Reddy Vanga About Mahesh Babu Characterization In-TeluguStop.com

ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగా మూవీ యూనిట్ మొత్తం నేడు హైదరాబాద్ కి చేరుకుంది.

కాసేపటి క్రితమే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సందీప్ వంగ మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.గత కొంత కాలం గా సోషల్ మీడియా లో మహేష్ బాబు ‘ఎనిమల్’ చిత్రాన్ని( Animal Movie ) రిజెక్ట్ చేసాడని, సందీప్ వంగ ముందుగా ఈ స్టోరీ ని మహేష్ కి వినిపించాడని ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది.

Telugu Animal, Devil, Sandeepreddy, Guntur Karam, Mahesh Babu, Rajamouli, Ranbir

దీని గురించి ఒక మీడియా రిపోర్టర్ అడగగా సందీప్ దానికి సమాధానం చెప్తూ ‘నేను మహేష్ బాబు గారికి కథని వినిపించిన విషయం వాస్తవమే, కానీ అది ఎనిమల్ కథ కాదు, నేను ఆయనకీ చెప్పిన కథ ‘డెవిల్’.( Devil ) ఇందులో మహేష్ బాబు క్యారక్టర్ ని నేను జంతువు కంటే క్రూరంగా చూపించాలని అనుకున్నాను.ఆయనకీ కూడా కథ నచ్చింది, రిజెక్ట్ చెయ్యలేదు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలు ఎక్కలేకపోయింది , కానీ త్వరలోనే మహేష్ గారితో సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

సందీప్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.ఈమధ్య కాలం లో మహేష్ ఎక్కువగా కమర్షియల్ సబ్జక్ట్స్ మాత్రమే చేస్తున్నాడు.

ఎందుకంటే డిఫరెంట్ గా ప్రయత్నం చేసిన ప్రతీ సారి ఆయనకీ ఎదురు దెబ్బలే తగిలాయి.అందుకే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే చిత్రాలే చేస్తున్నాడు.

Telugu Animal, Devil, Sandeepreddy, Guntur Karam, Mahesh Babu, Rajamouli, Ranbir

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ‘గుంటూరు కారం’( Guntur Karam Movie ) అనే చిత్రం చేస్తున్న మహేష్ బాబు, ఈ చిత్రం తర్వాత ఆయన రాజమౌళి తియ్యబోయ్యే సినిమాలో జాయిన్ అవ్వబోతున్నాడు.రాజమౌళి చిత్రం పూర్తి అయిన వెంటనే సందీప్ వంగ తో సినిమా చేసే అవకాశం ఉంది.అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.రేపు ‘ఎనిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది, మహేష్ మరియు రాజమౌళి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి, అలాగే సందీప్ వంగ తో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్ గురించి పలు వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube