వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లలో ఒకరుగా పేరు పొందిన అనిల్ కుమార్( Anil Kumar ) ప్రతిపక్షాలను విమర్శించడంలో చాలా అగ్రిసివ్ గా ఉంటారు .ఒక్కోసారి శృతి మించే ఆయన వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందులు తెచ్చినా కూడా వైయస్ జగన్( YS Jagan ) పట్ల ఆయన చూపించే విధేయత ,పార్టీపై ఆయన చూపే అభిమానంతో ఆయనను ఏమీ అనలేని పరిస్థితులలో వేసిపి అధిష్టానం ఉంటుంది.
రెడ్ల ప్రాబల్యం అధికం గా ఉన్న నెల్లూరు జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయ కేతనం ఎగరవేసిన అనిల్ తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానినని అని చెప్పుకుంటారు.జగన్ కూడా ఆయన పట్ల అంతే అభిమానాన్ని చూపిస్తారని అందుకే ఆయనకు నీటిపారుదల శాఖ లాంటి కీలక మంత్రి పదవి ని కట్టబెట్టారని కూడా వైసిపి శ్రేణులు చెబుతాయి .
![Telugu Anil Kumar, Anilkumar, Roopa Kumar, Ys Jagan-Telugu Political News Telugu Anil Kumar, Anilkumar, Roopa Kumar, Ys Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/05/Anil-kumar-yadam-taking-big-headache-tohis-partya.jpg)
అయితే గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందిగా మారిందని వార్తలు వస్తున్నాయి.ఆయన తన వ్యవహార శైలితో వర్గ పోరుకు తెర తీస్తున్నారని వైసీపీలోని( YCP ) కీలక నాయకులతో జగడం పెట్టుకుంటూ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని వార్తలు వస్తున్నాయి.మంత్రి పదవి తొలగించిన తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన అనిల్ కుమార్ ఆయన బాబాయి మరియు నెల్లూరు డిప్యూటీ మేయర్ అయిన రూప కుమార్( Roopa Kumar ) తో గొడవలతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు.స్వయంగా నెల్లూరు జిల్లా పర్యటనలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సర్ది చెప్పి ఒకరి చేతుల్లో మరొకరి చేతులు వేసి కలిసి పనిచేయాలని సూచించినా కూడా తగ్గేదె లే అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉన్నదని వార్తలు వస్తున్నాయి.
![Telugu Anil Kumar, Anilkumar, Roopa Kumar, Ys Jagan-Telugu Political News Telugu Anil Kumar, Anilkumar, Roopa Kumar, Ys Jagan-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/05/Anil-kumar-yadam-taking-big-headache-tohis-partyb.jpg)
రాజకీయాల నుంచి అయినా తప్పుకుంటాను గాని బాబాయితో సర్దుబాటు చేసుకోనని తన అనుచరులతో స్పష్టం చేసిన అనిల్ ఈ విషయంలో జగన్ను కూడా లెక్కచేయనని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది.హనుమంతుడు గుండెల్లో రాముడున్నట్టు తన గుండెలో జగన్ ఉంటాడని భారీ స్టేట్మెంట్లు ఇచ్చే అనిల్ వాస్తవం లో ఇలా చిన్నచిన్న విషయాల లో కూడా జగన్ మాటలు లెక్కచేయకుండా ఏ రకమైన విధేయత చూపిస్తున్నారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి మరి ఇప్పటికే అనేక సమస్యలతో సతమవుతున్న వైసీపీ అధిష్టానం ఈ నెల్లూరు నాయకుడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందో లేక సర్దుకుపోతుందో చూడాలి
.