కర్ణాటక ముఖ్యమంత్రి పీటముడి ఇంకా వీడడం లేదు .ఇద్దరికీ సమానకాలం పదవి ఇచ్చి సంతృప్తి పరుద్దామని ఆశించిన కాంగ్రెస్ అధిష్టానం ఎత్తులు ట్రబుల్ షూటర్ డీకే ముందు పారడం లేదని తెలుస్తుంది.
ఇస్తే పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి లేకపోతే కనీసం మంత్రిగా కూడా అవకాశం వద్దని తేల్చి చెప్పేసిన డీకే కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద పరీక్ష పెట్టినట్లుగా తెలుస్తుంది .కష్టకాలంలో ధైర్యంగా నిలబడి సమస్యలు తీర్చిన డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి ఉన్నా కూడా అనేక సమీకరణాలు అందుకు అడ్డువస్తున్నాయని తెలుస్తుంది .

సామాజిక వర్గం మద్దత్తు పరంగా బలంగా ఉన్న సిద్ధరామయ్య పార్టీలో( Siddaramaiah ) అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు.మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉందని సమాచారం .సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవడం, పరిపాలన దక్షత కూడా ఉండడంతో ఆయనని ఎంపిక చేస్తే పరిపాలన నల్లేరుపై నడకలా ఉంటుందని భావించిన అధిష్టానానికి డీకే ఎపిసోడ్ తలపోటుగా మారింది.అయితే నిజానికి కాంగ్రెస్కి ఇన్ని సీట్లు వచ్చి బిజెపిని ఎదుర్కొని ఆ పార్టీ నిలబడగలిగింది అంటే అది డీకే శివకుమార్ ( D.K.Shivakumar, )వ్యూహా నిపుణత , అసమాన్య పట్టుదలే కారణమని చెప్పాలి.

సాధారణంగా కూడా పార్టీ అధ్యక్షుడు నే ముఖ్యమంత్రి చేసే సాంప్రదాయం కాంగ్రెస్ లో ఉంది .అయితే కర్ణాటక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.తనను ముఖ్యమంత్రి చేయకపోతే తాను పార్టీని చీలుస్తాననే వార్తలు అవాస్తవమని తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని అని డీకే శివకుమార్ చెప్పుకుంటున్నప్పటికీ, కర్ణాటక వ్యవహారాలపై ఒక కన్నేసి ఉంచిన బిజెపిని తక్కువ అంచనా వేయలేమని పరిస్థితులను ఎలాగైనా మార్చగల శక్తి ఆ పార్టీకి ఉంది కాబట్టి రిస్కు తీసుకోవడం అనవసరమైన భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలుస్తుంది .మరి కొన్ని రోజులు సమయం తీసుకునైనా సరే ఇద్దరి నేతలను బుజ్జగించి ఇద్దరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకునే ఉద్దేశంలో కాంగ్రెస్ ( Congress )ఉన్నట్లుగా తెలుస్తోంది.సాధించిన విజయం తాలూకూ ఆనందం కన్నా ఈ సమస్యను పరిష్కరించడమే కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద ఇబ్బందిగా మారింది
.






