ఈ మధ్యకాలంలో విమానాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందితో కూడా గొడవలు పడుతూ ఉంటారు.ఇలా గొడవలు పడుతున్న కొంతమంది దురసు ప్రయాణికులను విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉంటారు.
తాజాగా వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ విమానంలో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడికి భారీ షాక్ తగిలినంత పని అయింది.అతడి దురుసు ప్రవర్తనతో విసిగిపోయిన పైలట్ సిబ్బందితో కలిసి నిందితుడిని బయటకు గెంటేశారు.
టౌన్స్ విల్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.విమానంలో ఆ వ్యక్తి సిబ్బందితో ప్రయాణికులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడని ఎంత చెప్పినా శాంతించలేదని ఇతర ప్రయాణికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నిందితుడు సిబ్బందిలో ఒకరి షర్టు పట్టుకొని మరింత దురుసుగా ప్రవర్తించాడు.కొన్ని నిమిషాల పాటు విమానంలో సాగిన ఈ రచ్చ తో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు.
అతడు తమ పై చేయి చేసుకునే ప్రమాదం ఉండొచ్చేమో అని సిబ్బంది అతడిని బలవంతంగా విమానం నుంచి బయటకి పంపారు.టౌన్స్ విల్ విమానాశ్రయ భద్రతాధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన పై వర్జిన్ ఆస్ట్రేలియా సంస్థ కూడా స్పందించింది. ప్రయాణికులు సిబ్బంది భద్రతకే మా తొలి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది.ఇటువంటి దురుసు ప్రవర్తనను మేము ఎంత మాత్రం సహించబోమని ఆ సంస్థ ప్రతినిధి మీడియా సమావేశంలో వెల్లడించారు.అయితే గత సంవత్సరం ఒక ప్రయాణికుడిని విమానంలో ఎటు కదలకుండా టేపు చుట్టి బంధించారు.
విమానంలో ఈ ప్రయాణికుడు మద్యం సేవించాక రచ్చ రచ్చ చేస్తున్నప్పుడు అతడికి ఆ శిక్ష విధించామని కూడా ఎయిర్ లైన్స్ భద్రతా సిబ్బంది వెల్లడించారు.







