బెడ్ రూమ్ సీన్లలో నటించి తప్పు చేశానంటున్న స్టార్ హీరోయిన్.... 

తెలుగులో తారామణి, యుగానికి ఒక్కడు, గృహం, తడాకా, వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో  అలరించినటువంటి హీరోయిన్ ఆండ్రియా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

అయితే తాజాగా ఆండ్రియా గాయనిగా కూడా బాగానే రాణిస్తోంది.

ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన పాటలతో పలు రకాల మ్యూజిక్ ఈవెంట్లలో కూడా అలరిస్తోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన సినీ జీవితంలో చేసినటువంటి కొన్ని పాత్రల పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా ఈమె చేసినటువంటి కొన్ని దుస్తులు లేకుండా చేసినటువంటి సీన్లను తలుచుకుని ఇప్పుడు బాధ పడుతోంది.ఎందుకంటే ఆ సన్నివేశాలను చూసినటువంటి కొందరు దర్శకనిర్మాతలు తాను అలాంటి పాత్రలే చేస్తానకుని అలాంటి బోల్డ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారట.

దీంతో గ్లామర్ కి ప్రాధాన్యత లేకపోయినా పర్లేదు కానీ తన పాత్రకు మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలని ఈసారి నుండి షరతులు పెడుతోందట ఈ అమ్మడు.అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలు ఇస్తే తన పారితోషికం తగ్గించుకుంటాననీ కూడా దర్శకులకు చెబుతోంది ఈ అమ్మడు.

Advertisement

మరి దర్శకులు ఈ విషయాన్ని తీసుకుంటారో చూడాలి.

అయితే ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం దాదాపుగా 5 చిత్రాల్లో నటిస్తోంది.ఇందులో తమిళ్ తలైవా విజయ్ లేటెస్ట్ ఉన్నటువంటి మాస్టర్ చిత్రం లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు