కొన్ని సంఘటనలు చూస్తే ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.తాజాగా ఇలాంటి సంఘటననే ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి లో ఒక విషాద సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే….ఇటీవల దేవరపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతి ఇంట్లో ఒక ఫంక్షన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె కుమార్తె అయిన సరిత పుట్టింటికి రావడం జరిగింది.
ఇది ఇలా ఉండగా నేడు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు సరిత బాత్రూంలో కాలుజారి పడిపోయింది.
దీనితో సరిత తలకు బలమైన గాయాలయ్యాయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.ఇక ఒక్కసారిగా తన కూతురు ఇలా మరణించడంతో వరలక్ష్మి ఇంట్లోనే కుప్పకూలిపోయింది.సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వరలక్ష్మిని హుటాహుటిగా ఆస్పత్రికి తరలించగా…వైద్య అధికారులు గుండెపోటుతో ఆమె మరణించింది అని తెలియజేశారు.
ఇక తల్లి కూతుర్లు ఒకే సారి ఇలా చనిపోవడంతో దేవరపల్లి గ్రామంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.ఓకే కుటుంబానికి చెందిన తల్లి కూతుర్లు ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.పేగు బంధం అంటే ఇదేనేమో అని కొన్ని సందర్భాలు చూస్తే అర్థమవుతుంది.ఏది ఏమైనా కానీ ఒక శుభకార్యానికి వచ్చిన యువతికి ఇలా జరగడంతో గ్రామస్తులను చాలా కలచివేసింది.