ఏపీ ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం( Andhra Pradesh Governament ) వరుస ఉద్యోగ నోటిఫికేషన్( Job Notification ) లు విడుదల చేయడం జరిగింది.ముందుగా 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Andhra Pradesh Governament Released Serial Job Notifications Appsc, Ap Govername-TeluguStop.com

వచ్చే ఏడాది జనవరి నుంచి జనవరి 29 వరకు అప్లికేషన్స్ స్వీకరించబోతున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేయడం జరిగింది.ఈ మేరకు APPSC సభ్యుడు పరిగె సుధీర్ ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 99 లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా APPSC సిద్ధమయింది.జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.

అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 42 సంవత్సరాలుగా నిర్ణయించగా.రిజర్వేషన్ ఆధారంగా సడలింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

బీటెక్ మరియు ఎంటెక్, పీజీ అర్హత కలిగిన వాళ్లు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.ఈ క్రమంలో ఎంపికైన వారికి ₹56,100-₹98,400 మధ్య జీతం ఉండనుంది.

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.2019 ఎన్నికల కంటే ముందుగానే ఈసారి 2024 ఎన్నికలు( 2024 elections).రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube