సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!!

తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగలలో సంక్రాంతి( Sankranthi ) ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు.

సంక్రాంతి అంటే సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.ప్రధానంగా గోదావరి జిల్లాలలో కోడిపందాలు, రకరకాల ఆటలతో సందడి వాతావరణం నెలకొంటది.

చాలా చోట్ల నుండి గోదావరి జిల్లాలలో సంక్రాంతి వేడుకలకు ప్రజలు వస్తుంటారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను( Sankranthi Holidays ) తాజాగా ప్రకటించింది.

ఇంటర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.ఆ తర్వాత ఈనెల 18న తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేయడం జరిగింది.

Advertisement

అంతేకాదు అన్ని ప్రభుత్వ, ప్రవేట్, ఎయిడెడ్ కాలేజీలు తప్పకుండా విద్యార్థులకు హాలిడేస్ ఇవ్వాలని సెలవులలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.ఇదే సమయంలో పాఠశాలలకు పది రోజులపాటు సెలవులు ప్రకటించింది.

ఇంటర్ కాలేజీలకు మాదిరిగానే సెలవు రోజులలో పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.వాస్తవానికి జనవరి 16 వరకు సెలవులు ఉంటాయని అనుకున్నా ఆ తర్వాత మార్పు చేయడం జరిగింది.

ఈనెల 9వ తారీకు నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు 10 రోజులపాటు సెలవులు ప్రకటించింది.జనవరి 19వ తారీఖు స్కూలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

వైరల్ వీడియో : అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!
Advertisement

తాజా వార్తలు