ఏపీకి అన్యాయం'పై ఎలుగెత్తి చాటుతారా?

రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందనే సంగతి అందరికీ తెలుసు.

విభజన సమయంలో చట్టసభల్లో, బయట ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు తదితర భాజపా నాయకులు చెప్పిన మాటలు వేరు.

అధికారంలోకి వచ్చాక చేస్తున్న చేష్టలు వేరు.రెండింటికీ పొంతన లేదు.

బాబు, మోదీ అధికార పీఠాలెక్కి ఏడాది కావొస్తోంది.ఇప్పటివరకూ ఏపీకి ప్రత్యేక హోదా ఊసే లేదు.

ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంటులో తెగేసి చెప్పినా వెంకయ్య, నిర్మలా సీతారామన్‌ మొదలైనవారు ఇస్తాం.ఇస్తాం అంటూనే ఉన్నారు.

Advertisement

ఇది వినాయకుడి పెళ్లి మాదిరిగా ఉంది తప్ప పని అయ్యేలా కనబడటంలేదు.ముఖ్యమంత్రి బాబు కూడా కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలేదు.

దీంతో ప్రజల్లోనూ అసహనం కలుగుతోంది.అందుకే చంద్రబాబు రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనుకుంటున్నారు.

ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని వేదికగా చేసుకోవాలనుకుంటున్నారు.ఏపీలో జూన్‌ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఈ సందర్భంలోనే బాబు ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడతారట.జూన్‌ ఎనిమిదో తేదీన బహిరంగ సభ జరుపుతారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

బహుశా అందులో బాబు మాట్లాడతారేమో.!.

Advertisement

తాజా వార్తలు