కేసీఆర్‌ కోసం నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు.. అతడి అసలు స్టోరీ ఇది

ఒక వైపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ఏపీ నాయకులపై నిప్పులు చెరుగుతున్నాడు.

ఏపీ నాయకులు తెలంగాణ అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నాడు.

మరో సారితానే సీఎం అవుతాను అంటూ నమ్మకంగా చెబుతున్నాడు.ఇలాంటి సమయంలో ఆంధ్రాకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి అంటూ తన నాలుకను కోసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

కేసీఆర్‌ సీఎంగా చేసిన పనులు తనకు చాలా నచ్చాయని, ఆయన మళ్లీ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని మహేష్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కానీలో చాలా కాలంగా నివాసం ఉంటున్న మహేష్‌ తాజాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కు వెళ్లి కేసీఆర్‌ మళ్లీ సీఎం అవ్వాలని పూజలు చేయించాడు.గట్టిగా కేసీఆర్‌ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తూ, జై కేసీఆర్‌ అన్నాడు.అందరు అతడిని చూస్తుండగానే తన జేబులో ఉన్న చిన్న కత్తిని తీసి నాలుకను కోసి హుండీలో వేశాడు.

Advertisement

కేసీఆర్‌ సీఎం అవ్వాలంటూ మొత్తుకున్నాడు.దాంతో ఒక్కసారిగా షాక్‌ అయిన స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు.

తీవ్ర రక్తస్రావం అయిన మహేష్‌కు వైధ్యులు చికిత్స అందించారు.హుండీలోంచి నాలుకను తీసి వైధ్యులు జాయింట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందుతున్న మహేష్‌ కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.మహేష్‌ చర్యతో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

టీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా మహేష్‌ను ఆదుకునేందుకు సిద్దంగా ఉందని తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మహేష్‌కు టీఆర్‌ఎస్‌ నుండి సాయం పెద్ద మొత్తంలో అదడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సాయం కోసమే మహేష్‌ ఇలా తన నాలుకను కోసుకున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి.కేసీఆర్‌పై అభిమానం ఉంటే ఆయన గురించి పాజిటివ్‌ గా మాట్లాడి ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలి కాని, నాలుక కోసుకోవడం ఏంటని, ఏదో ఉద్దేశ్యంతోనే మహేష్‌ ఇలాంటి పని చేసి ఉంటాడని అంటున్నారు.

Advertisement

గోదావరి జిల్లాకు చెందిన మహేష్‌ హైదరాబాద్‌లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు.కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే మహేష్‌కు గట్టిగానే న్యాయం చేస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు