ఆ దేశంలో దొరికిన పురాతన టైల్స్.. షాకింగ్ నిజాలు వెలుగులోకి..?

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని సర్రేలో ఇటీవల పురాతన టైల్స్ బయటపడ్డాయి.టచ్‌స్టోన్ నిర్మాణ సంస్థలో ( Touchstone Construction Company )పనిచేసే ఒక కార్మికుడు ఒక పాత భవనం పైకప్పును తొలగిస్తుండగా పురాతన కాలం ఇటుక పలకలు కనిపించాయి.

 Ancient Tiles Found In That Country Shocking Facts Come To Light, Touchstone Con-TeluguStop.com

ప్రతి పలక వెనుక చిన్న చేతుల ముద్రలు ఉన్నాయని సదరు వ్యక్తి గమనించాడు.ఈ ముద్రలు పెద్దల చేతుల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి.

ఈ ముద్రలను ఫొటో తీసి టచ్‌స్టోన్ సర్రే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.“బాల కార్మికులను నిషేధించడానికి ముందు నుంచి పాత విక్టోరియన్ పైకప్పు పలకలపై పిల్లల చేతిముద్రలు కనిపించాయి.” అని దీనికి ఒక టైటిల్ కూడా జోడించాడు.వీడియోలో, బిల్డర్ తన అరచేతిని వాటిపై ఉంచడం ద్వారా చేతి ముద్రలను కొలిచాడు.

ఈ ప్రింట్లను బట్టి చూస్తుంటే ఈ చేతి ముద్రలు గల పిల్లల వయసు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అని అతను అంచనా వేసాడు.ఆసక్తికరంగా, విక్టోరియన్ శకంలో( Victorian era ) బాల కార్మికులు తమ సృష్టిలో పాలుపంచుకున్నారని సూచిస్తూ దాదాపు ప్రతి టైల్‌కు ఒకే పరిమాణపు చేతిముద్రలు ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.అప్పటికి పురుషుల చేతులు, కాళ్లు చిన్నవిగా ఉన్నందున, చేతిముద్రలు ఎదిగిన పురుషులకు చెందుతాయని కొంతమంది నెటిజన్లు ఊహించారు.మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, బాల కార్మికుల సమస్య ఆ రోజుల్లో కూడా ఉండేదా అని మరికొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ ముద్రలు చాలా పాతవి కావచ్చు, బహుశా 19వ శతాబ్దానికి చెందినవి అయి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ కాలంలో, బాల కార్మికులు చాలా సాధారణం.పిల్లలు కర్మాగారాల్లో పనిచేసి, ఇటుకలు తయారు చేయడంలో సహాయం చేసేవారు.

ఈ ముద్రలు చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని గుర్తు చేస్తాయి.బాల కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు, దోపిడీ గురించి తెలియజేస్తాయి.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు ఇప్పటికీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.బ్రిటన్‌లో 1933లో బాల కార్మికులను నిషేధించారు.

కానీ చాలా దేశాలలో, బాల కార్మికులు ఇప్పటికీ ఒక సమస్యగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube