సినిమా హీరోయిన్ల కు ఏ మాత్రం తగ్గకుండా పారితోషకం ( Remuneration ) తీసుకుంటున్న బుల్లి తెర స్టార్లు… సినిమా నటులకు ఏ మాత్రం తగ్గకుండా సీరియల్స్ లో నటిస్తున్న నటి నటులు కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు.వీళ్ళు కూడా వీలైనప్పుడు సినిమాలు చేస్తున్నారు కానీ సీరియల్స్ లోనే వీళ్ళు ఎక్కువ బిజీ గా ఉంటున్నారు…వీళ్ళే కాకుండా టీవీ షోస్ చేస్తున్న యాంకర్స్ కూడా ఎప్పుడు షోస్ కి సంభందించిన షూటింగ్స్ లో బిజీ గా గడుపుతున్నారు ఇంతకీ వీళ్ళు ఒక్క షో కి గాని, ఒక్క సీరియల్ కి గాని ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం…
సుమ

సుమ ( Anchor Suma )గురించి అందరికి తెలిసిందే ఒక షోకి గాని, ఈవెంట్ కి గాని సుమ యాంకరింగ్ చేసిందంటే ఆ షో లు, ఈవెంట్లు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే.అందరితో చక చక మాట్లాడుతూ ఆన్ ది స్పాట్ పంచులు వేస్తూ అందరిని నవ్విస్తుంది అయితే సుమ ఒక్క ఈవెంట్ కి రూ.3.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.అదే షోస్ కి అయితే ఒక్క ఎపిసోడ్ కి 3 లక్షల వరకు తీసుకుంటుందని తెలుస్తుంది.
అనసూయ

ఒక పక్క సినిమాలు మరొక పక్క ఈవెంట్స్ చేస్తున్న అనసూయ( Anasuya ) ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా 2 నుండి 3 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.
రష్మీ గౌతమ్

జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటి సంపాదించిన రష్మీ గౌతమ్( Rashmi Gautam ) ఒక పక్క సినిమాలు మరో పక్క ఈవెంట్స్ చేస్తుంది అలాగే యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంది.రష్మీ గౌతమ్ ఒక్కో ఈవెంట్ కి 3 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది.
ప్రేమి విశ్వనాథ్

కార్తిక దీపం సీరియల్ లో వంటలక్కగా ఫేమస్ అయినా ప్రేమి విశ్వనాథ్( Premi Vishwanath ) రోజుకి 25 వేలు పారితోషికం అందుకుంటుంది
సుహాసిని

ఒకప్పుడు చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సుహాసిని ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది అయినప్పటికీ తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్ లో నటిస్తూ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తున్నందుకు గాను సుహాసిని రోజుకి 20 వేల పారితోషకం తీసుకుంటుంది
నవ్య స్వామి

బుల్లితెరలో సీరియల్స్ బిజీగా ఉన్న నవ్య స్వామి రోజుకి 20 వేల పారితోషకం తీసుకుంటుంది
పల్లవి రామిశెట్టి

టివి సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్న పల్లవి రామిశెట్టి రోజుకి 15 వేల పారితోషకం తీసుకుంటుంది
హరిత

హీరోయిన్ రవళి సోదరి.నటుడు జాకీ భార్య, సినిమాలు, సీరియళ్లతో బిజీగా ఉన్న హరిత రోజుకి 12 వేల పారితోషకం తీసుకుంటుంది…ఇలా సీరియల్స్ లో నటిస్తూ సినిమా నటులకి తగ్గకుండా పారితోషికం తీసుకుంటూ బిజీ లైఫ్ ని గడుపుతున్నారు…
.







