సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళు చేసిన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వాళ్ళ స్టామినా ఏంటో నిరూపించుకున్నారు ఆ కోవా కె చేసిందినవాడు మల్లిడి వేణు అలియాస్ వశిష్ట( Mallidi Venu )… 2022లో కళ్యాణ్ రామ్( Kalyan Ram) హీరోగా “బింబిసార” సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు.కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించిందని చెప్పవచ్చు.
ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తన నెక్స్ట్ సినిమా కోసం కూడా వశిష్ట మరొక పెద్ద స్టార్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.తాజా సమాచారం ప్రకారం తన నెక్స్ట్ సినిమాను చేయడం కోసం వశిష్ట ఏకంగా ప్రభాస్ ( Prabhas )మీద కన్నేసారని తెలుస్తోంది.ఈ మధ్యనే వశిష్ట ప్రభాస్ కు ఒక మంచి కథను కూడా వినిపించారు అని తెలుస్తుంది…

ఆ కథ కూడా చాలా ఫ్రెష్ గా ఉందట అది ప్రభాస్ కి కూడా పిచ్చి పిచ్చి గా నచ్చేసిందట దాంతో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది… ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు కమిట్ అయి ఉండటం వల్ల ఈ సినిమా రావడానికి కొంత సమయం పట్టవచ్చు…

అయిన కమిట్ అయిన అన్ని సినిమాలు పూర్తి అయ్యాక ప్రభాస్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే వశిష్ఠ ఇప్పటికే బింబిసారా 2 చేయాల్సి ఉంది.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నా ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి అయ్యాయి దాంతో వశిష్ఠ ఈ సినిమా చేసిన తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది…చూడాలి మరి వీళ్ళ కాంబో ఎప్పటికీ వర్క్ అవుట్ అవుతుందో…
.







