ఆ కమెడియన్ కు హగ్ ఇస్తానన్న వర్షిణి.. ఏమైందంటే..?

బుల్లితెర డ్యాన్స్ షోలలో ఒకటైన ఢీ షో ద్వారా వర్షిణి ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

హైపర్ ఆది వర్షిణి జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.

అయితే ఢీ షో నుంచి కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడం జరిగింది.వర్షిణి స్థానంలో టిక్ టాక్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న దీపికా పిల్లి ఢీ షోకు వస్తుండగా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలవుతున్నారు.

మరోవైపు ఢీ షోలో ఛాన్స్ పోయినప్పటికీ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షోకు వర్షిణి సోలో యాంకర్ గా చేస్తున్నారు.వర్షిణి సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించినా బుల్లితెర ద్వారానే ఆమె ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

సోలో యాంకర్ గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో వర్షిణి సక్సెస్ అవుతున్నారు.తాజాగా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న అవినాష్ తమ్ముడు అజయ్ సోషల్ మీడియా ఫాలోవర్లతో ముచ్చటించారు.

Advertisement

ఇప్పుడిప్పుడే కామెడీ స్టార్స్ షో ద్వారా పాపులారిటీని పెంచుకుంటున్న అజయ్ కు ఒక వర్షిణి విష్ణుప్రియలలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు అజయ్ వర్షిణి పేరును సమాధానంగా చెప్పారు.అజయ్ తన పేరును చెప్పడంలో వర్షిణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అవినాష్ తమ్ముడు అజయ్ కు వర్షిణి ఏకంగా హగ్ ఇస్తానని చెప్పారు.మరోవైపు యాంకర్ గా వర్షిణి క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు వర్షిణికి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది.అయితే గతంలో బిగ్ బాస్ ఆఫర్లను రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్5లో పాల్గొంటారేమో చూడాల్సి ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు