టెన్షన్ పెడుతున్న యాంకర్ సుమ.. ఎందుకో తెలుసా..?

తెలుగు నటి, యాంకర్ సుమ పరిచయం గురించి తెలియని వారెవ్వరు లేరు.

తన యాంకరింగ్ తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుమ తన మాటలతో వేదిక మొత్తం సందడి చేస్తుంది.

ఎన్నో షోలలో, సినీ అవార్డు ఫంక్షన్ లలో, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో తన యాంకరింగ్ తో ఎంతో హంగామా చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా నటించిన సుమ.తనకంటూ క్రేజ్ ను మాత్రం బుల్లితెర పైనే సంపాదించుకుంది.ఇక ఎంటర్టైన్మెంట్, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రోగ్రాములే కాకుండా పలు యాడ్స్ లో కూడా చేసింది.

స్టార్ నటుల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది సుమ.ప్రస్తుతం బుల్లితెర లో పలు షోలతో బాగా బిజీగా ఉంది.ఇక లేటు వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తుంది సుమ.ఇదిలా ఉంటే ఈమధ్య ప్రేక్షకులను బాగా టెన్షన్ పడేలా చేస్తుంది.

Advertisement

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక వీడియోతో అభిమానులను తెగ నవ్విస్తుంది.అంతేకాదండోయ్ ఆ వీడియోస్ వెనుక ఏదో ఒక సందేశాన్ని అందిస్తుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇందులో ఏదో హడావిడిగా తిరుగుతున్నట్లు కనిపించి నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటూ తడబడుతూ తరువాత చెబుతానంటూ సస్పెన్స్ ఇచ్చింది.పైగా జూలై 1 తేదీని ఇస్తూ రెండు రోజులు మాత్రమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇటీవలే ఇలాంటి వీడియోనే షేర్ చేసింది.అంతకుముందే క్యాలెండర్ లో జూలై 1న మార్క్ చేసి అదిరిపోయే ప్రకటన తెలుపుతానని వీడియో షేర్ చేసింది.ఇక ఆరోజు నుంచి నెటిజన్లు ఏ విషయం గురించి అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కొందరు తన కుమారుడి సినిమా గురించి అనగా, మరికొందరు బిగ్ బాస్ షో గురించేమో అని కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ సుమక్క జూలై 1న ఏ విషయం చెబుతుందో చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు