తల్లిపై ప్రేమను చాటుకున్న యాంకర్ సుమ.. చిన్నప్పుడు అలా చేశారంటూ?

బుల్లితెర నంబర్ 1 యాంకర్ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా సుమపేరు ఎక్కువగా వినిపిస్తుంది.

ఫ్లాప్ షోలను కూడా తన యాంకరింగ్ తో హిట్ చేసే టాలెంట్ ఉన్న యాంకర్ సుమ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటారని ఆమె రెమ్యునరేషన్ గురించి వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి.

స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లను హోస్ట్ చేసే అవకాశాలు కూడా సుమకే ఎక్కువగా వస్తుంటాయి.ఎంతోమంది యాంకర్లు బుల్లితెరపై ఎంట్రీఇచ్చినా ఆ యాంకర్లు సుమకు రెమ్యునరేషన్ విషయంలో కానీ యాంకరింగ్ విషయంలో కానీ పోటీని ఇవ్వలేకపోతున్నారు.

తాజాగా ఒక వీడియోను సుమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తల్లిపై ఉన్న ప్రేమను సుమ సోషల్ మీడియా ద్వారా చాటుకున్నారుతల్లి పుట్టినరోజును సుమ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు సుమ తల్లిబెస్ట్ ఫ్రెండ్స్ ను పిలిచి తల్లికి సర్ప్రైజ్ఇచ్చారు.

సుమ తన తల్లి గురించి చెబుతూ మా అమ్మ చిన్నప్పుడు పుట్టినరోజుకు గుడికి తీసుకొని వెళ్లడంతో పాటు ఇష్టమైన వంటలు చేసి తన స్నేహితులను పిలిచి ధూమ్ ధామ్గా వేడుకలను చేశారని చెప్పుకొచ్చారు.తాను పెద్దైన తర్వాత అమ్మను హోటల్ కు, రెస్టారెంట్ కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుకలు చేశానని అయితే అమ్మ ఇప్పుడు జరుపుకుంటున్న పుట్టినరోజుకు మాత్రం అమ్మ తనకు ఏం చేసిందో దానినే రిపీట్ చేశానని ఆమె తెలిపారు.

Advertisement

తాను ఉదయాన్నే లేచి వంటలు చేసిఅమ్మ స్నేహితులను పిలిచి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నానని తనకు ఎంతో ఆనందంగా ఉందని సుమ అన్నారు.భగవంతుడు అమ్మ తనపై చూపిన ప్రేమనంతా తిరిగి ఇచ్చే అవకాశాన్ని ఇచ్చాడని సుమ వెల్లడించారు.అమ్మకు సుమ పుట్టినరోజు విషెస్ చెప్పడంతో పాటు ప్రేమగా ముద్దు పెట్టారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు