పుర్రెలను కూడా వదలవా.. అంటూ అషురెడ్డి పై కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

బుల్లితెరపై యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నఅషురెడ్డి గురించి అందరికీ తెలిసిందే.

 Anchor Ravi Shocking Comment On Ashu Reddy , Anchor Ravi, Comment, Ashu Reddy, F-TeluguStop.com

ఇక వీరిద్దరూ కలిసి హ్యాపీ డేస్ అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే యాంకర్ రవి అషురెడ్డి నిత్యం ఏదో ఒక విషయం ద్వారా గొడవ పడుతూ ఉండటం లేదా రవి అషురెడ్డి ఫోటో షూట్ లపై కామెంట్లు చేయడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం రవి అషురెడ్డి శ్రీవల్లి గెటప్ లో  ఉన్న ఫోటో పై కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.తాజాగా అషురెడ్డి అబ్రక దబ్ర అంటూ సెట్‌లో ఉన్న మంత్ర దండం మెడలో పుర్రెలు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలపై యాంకర్ రవి తనదైన శైలిలో స్పందిస్తూ అషురెడ్డి పరువు మొత్తం తీశారు.

ఈ క్రమంలోనే రవి మాట్లాడుతూ. అవి సెట్ ప్రాపర్టీస్.చివరికి ఈ పుర్రెలను కూడా వదలవా అంటూ తన పరువు తీశాడు.దీంతో అషురెడ్డి రిప్లై ఇస్తూ…అవి కూడా మనవే కదా? అంటూ రవి పై రివర్స్ పంచ్ వేసింది.మొత్తానికి పుర్రెల దండను మెడలో వేసుకుని అషు రెడ్డి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే పలువురు నెటిజనులు ఈ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Anchor Ravi Shocking Comment On Ashu Reddy , Anchor Ravi, Comment, Ashu Reddy, Film Industry - Telugu Anchor Ravi, Ashu Reddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube