బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది.మొత్తం 19 మంది కంటెస్టెంట్ లతో ఈ సీజన్ ప్రారంభం కాగా ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్ లు మిగిలారు.
అందులో శ్రీ రామ్, సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్.మొత్తానికి ఈ ఐదుగురిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అనేది బాగా సస్పెన్స్ గా మారింది.
సోషల్ మీడియాలో మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు సన్నీ లేదా షణ్ముఖ్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు.వీరిద్దరిలో ఎవరైనా ఒకరు గెలుస్తారు అనేది వాళ్ళల్లో నమ్మకం ఏర్పడింది.
సిరి, మానస్, శ్రీరామ్ లలో శ్రీరామ్ మూడవ కంటెస్టెంట్ గా ఉంటాడని తెలుస్తుంది.మొత్తానికి ఈసారి కూడా ఈ సీజన్ బాగా హైలెట్ గా మారింది.
ప్రేక్షకులు మాత్రం ఏ ఒక్క రోజు కూడా ఈ షోను మిస్ కాకుండా చూశారు.
ప్రతిరోజు ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్న కంటెస్టెంట్ లకు ఓట్లు వేసి మరి ముందుకు ప్రయాణించేలా చేశారు.
చివరికి వచ్చేసరికి ఎవరికి వేయాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని ప్రేక్షకులలో కూడా ఆలోచనలు మొదలయ్యాయి.మొత్తానికి తమ తమ అభిమాన కంటెస్టెంట్ లందరికీ ప్రేక్షకులు మాత్రం ఓట్లు వేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన కంటెస్టెంట్ ల ఫోటోలను పెడుతూ వారికి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నారు.తెగ ప్రచారాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యాంకర్ రవి కూడా తన సోషల్ మీడియా వేదికగా సరికొత్తగా ప్రచారం చేశాడు.తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నా ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంతకూ అందులో ఏముందంటే.తాను ఒక పడవలో దిగులుగా ఆలోచిస్తూ ప్రయాణిస్తూ కనిపించాడు.ఇక దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా గెలుపు తలుపులే అనే పాటను కూడా పెట్టాడు.ఆ వీడియో షేర్ చేస్తూ.జైశ్రీరామ్ అంటూ.ఆ దేవుడు మంచి సక్సెస్ ను మంచి ఆరోగ్యమును ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
దీంతో చాలామంది నెటిజన్లు ఇది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీరామ్ కోసం సరికొత్త గా ప్రచారం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు.అందుకే జై శ్రీరామ్ అని అతనిని ఉద్దేశించిన విధంగా పెట్టాడని కామెంట్లు పెడుతున్నారు.
పైగా అతను పాడిన పాట గెలుపు తలుపులే పెట్టేసరికి అందరిలో ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆయనకు సపోర్ట్ చేయమని ఇన్ డైరెక్ట్ గా కోరుతున్నాడు అన్నట్లు తెలుపుతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ.యాంకర్ రవి మాత్రం శ్రీరామ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మరి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో అవుతారో చూడాలి.ఇక ఈ షో మరి కొన్ని గంటలలోనే పూర్తికానుంది.