తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై రష్మీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికి తెలిసిందే.
జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది రష్మీ.యాంకర్ గా వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేసుకుంది రష్మి గౌతమ్.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోతో పాటు జబర్దస్త్ షోకీ యాంకర్ గా వ్యవహారిస్తోంది.అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ.
ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు ఈవెంట్లలో తన స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతూ ఉంటుంది.అయితే బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ వెండి తెర పై పలు సినిమాలలో నటించింది.
ఆమెకు వెండితెర అంతగా కలిసి రాకపోవడంతో బుల్లితెరపై తన సత్తాను చాటుతోంది.ఇక యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మి గౌతమ్.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటూ ఉంటుంది.అంతే కాకుండా మూగ జంతువులకు ఏదైనా హాని కలిగించే ఇబ్బంది కలిగించే వీడియోలు వైరల్ అయితే వెంటనే ఆ వీడియో పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ ఇండియాలో రష్మీ గౌతమ్ కి సంబంధించిన కొన్ని పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలలో రష్మి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది.ఆ ఫోటోలో ఆమెతోపాటు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు.వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.