సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కొందరు సినిమాల ద్వారా పాపులర్ అయితే మరికొందరు అందంతో పాపులర్ అవుతూ ఉంటారు.మరికొందరు కాంట్రవర్సీల ద్వారా పాపులర్ అవుతారు.
కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి మాత్రం పెళ్లిళ్లతో పాపులర్ అయ్యింది.అంతేకాకుండా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆ నటి ఇప్పుడు నాలుగో పెళ్లికి కూడా సిద్ధమైనట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆమె మరెవరో కాదు వనిత విజయ్ కుమార్.ఈమె నటిగా కంటే పర్సనల్ విషయాల ద్వారానే ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ బాగా పాపులర్ అయ్యింది.
మరి ముఖ్యంగా ఈమె పెళ్లిళ్ల విషయంలో ఈమె పేరు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలాగే టాలీవుడ్ ని ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా వనిత విజయ్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో దేవుడు అన్ని చూస్తున్నాడు.
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.అంటూ ఒక ట్వీట్ చేసింది.
ఆమె ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మనం మన పక్కనున్న వారిని మోసం చేయవచ్చు.
వారి డబ్బును దొంగలించవచ్చు.కానీ డబ్బు కోసం మీరు దొంగతనం మాత్రం చేయకండి.
మీకు తెలియని విషయం ఏమిటంటే మనందరిపై ఒక శక్తి పని చేస్తూ ఉంటుంది.
ఆ శక్తి మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది.నీ శత్రువులను కూడా క్షమించే గుణం నీకు దగ్గర ఉంటే ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు.అది కాకుండా మనుషులు తప్పులు చేసుకుంటూ వచ్చి చివరికి నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు.
తప్పులన్నీ చేసి చివరికి ఎవరిని నిందిస్తారు? సమస్యల పరిష్కారానికి దేవుడి మీకు సపోర్టు ఇవ్వలేదంటే మీరు పాపాలు చేసిందంటే అర్థం.వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెబుతుంది అంటూ ట్వీట్ చేసింది.
అయితే వనిత విజయ్ కుమార్ ఆ ట్వీట్ ని ఎవరిని ఉద్దేశించి చేసింది అన్నది అర్థం కావడం లేదు.కాగా ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.