బుల్లితెర కార్యక్రమాలలో జంటగా సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ (Rashmi ) సుడిగాలి సుదీర్ ( Sudigali Sudheer )జంట ఒకటి అని చెప్పాలి.ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వీరిద్దరూ కలిసి జబర్దస్త్(Jabardasth )కార్యక్రమంలో చేసే సమయంలో అలాగే పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా ఇద్దరూ పర్ఫామెన్స్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక సుధీర్ రష్మీ వీరి పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అన్న సందేహం మాత్రం రాకమానదు.

ఇప్పటికి సుధీర్ రష్మీ గురించి ఎన్నో రకాల వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే సుధీర్ సినిమా అవకాశాలను అందుకోవడంతో బుల్లితెరకు కాస్త దూరమయ్యారు.ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి ఈయన ఈటీవీ 28వ వార్షికోత్సవ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.ఇలా ఈటీవీ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా బలగం ( Balagam ) అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రష్మీ సుధీర్ యాంకర్లుగా వ్యవహరించారు.ఈ వేడుకలలో భాగంగా సుదీర్ రష్మి ఇద్దరు కలిసి మరో అద్భుతమైన పర్ఫామెన్స్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుదీర్ రష్మీ లవ్ జర్నీ గురించి ఒక వీడియో ప్లే చేశారు.ఇందులో భాగంగా సుదీర్ మాట్లాడుతూ నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను అంటూ రష్మీ గురించి ఓ డైలాగ్ చెప్పడంతో రష్మీ ఆ మాటలకు ఎమోషనల్ అయ్యారు.అనంతరం సుధీర్ మాట్లాడుతూ మేం బయటకు వెళ్లిన లేదా మా ఫ్యామిలీతో వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా మా ఇద్దరి గురించి అడుగుతూ ఉంటారని సుధీర్ తెలిపారు.నా జర్నీలో నేను అందుకున్నటువంటి ఈ సక్సెస్ మొత్తం రష్మీ దేనని సుధీర్ తెలిపారు.
నా కెరియర్ లో నేను ఇలా ముందుకు వెళుతున్నాను అంటే అందులో రష్మీ పాత్ర చాలా ఉంది అంటూ సుధీర్ రష్మీకి థాంక్స్ చెప్పడమే కాకుండా చివరిలో ఐ మిస్ యు సో మచ్ అంటూ సుధీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







