SS Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఒకరు.కెరియర్ మొదట్లో ఈయన టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పని చేసేవారు.

 Did Rajamouli Getting Father Third Time Latest News Viral In Social Media Tolly-TeluguStop.com

ఇలా బుల్లితెర దర్శకుడిగా పని చేస్తున్నటువంటి రాజమౌళి అనంతరం ఎన్టీఆర్ ( Ntr )హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్( Student No1 )సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి అనంతరం వరుస సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇక ఈయన డైరెక్టర్గా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

అయితే ఈయన దర్శకత్వం వహించిన ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా అన్ని సినిమాలు ఎంతో మంచి విజయం అందుకోవడంతో రాజమౌళి అంటేనే అపజ మెరుగని దర్శకుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు .ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Telugu Time, Karthikeya, Mayuka, Oscar Award, Rajamouli, Rama, Tollywood-Movie

ఈ సినిమా స్ఫూర్తితో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో సంచలనమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డు( Oscar Award )ను కూడా అందుకొని తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి.ఇలా సినీ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రాజమౌళి రమా( Rama )అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇది రాజమౌళి మొదటి వివాహమైనప్పటికీ ఆమెకు మాత్రం ఇది రెండవ వివాహం.

Telugu Time, Karthikeya, Mayuka, Oscar Award, Rajamouli, Rama, Tollywood-Movie

రమ ఇదివరకే పెళ్లి చేసుకుని కార్తికేయ( Karthikeya )కు జన్మనిచ్చిన తర్వాత భర్తతో వచ్చిన మనస్పర్ధలు వల్ల విడిపోయారు.ఇలా కొడుకుతో ఒంటరిగా జీవిస్తూ ఉన్నటువంటి ఈమెను రాజమౌళి వివాహం చేసుకున్నారు.ఇక ఈ దంపతులకు పిల్లలు లేరు అయితే వీరిద్దరూ మాత్రం మయూకా( Mayuka ) అనే ఒక చిన్నారిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు.ఇదిలా ఉండగా తాజాగా రాజమౌళి గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

ఈయన మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనంగా మారింది.

Telugu Time, Karthikeya, Mayuka, Oscar Award, Rajamouli, Rama, Tollywood-Movie

తాత కావాల్సిన వయసులో రాజమౌళి మరోసారి తండ్రి కావడం ఏంటి అనే విషయానికి వస్తే… రాజమౌళి తండ్రి కాబోతున్నారు అంటే ఈయనకి మరోసారి పిల్లలు జన్మిస్తున్నారని అర్థం కాదు ఈయన అనాధ పిల్లలకు ఎంతో అండగా నిలుస్తున్న సంగతి మనకు తెలిసింది.ఈ క్రమంలోనే మరో అనాధ ఆడపిల్లను ఈయన దత్తత తీసుకొని వారి బాగోగులను చూసుకోబోతున్నారని తెలుస్తుంది.ఇలా ఆడపిల్లలంటే ఎంతో అమితమైన ప్రేమ ఉన్నటువంటి రాజమౌళి రేపటి తరానికి వారే ముఖ్యం అని భావిస్తూ మరో అమ్మాయిని దత్తత తీసుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube