ప్రస్తుత కాలంలో ప్రేమ వ్యవహారాలన్నీ దాదాపుగా విషాదంగా ముగుస్తున్నాయి.ప్రేమికులలో ఒకరు హత్యకు గురైతే మరొకరు జైలు పాలు అవుతున్నారు.
చాలామంది వ్యామోహంతో కామకోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ప్రేమ పేరుతో( Love ) దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఓ వ్యక్తి తాను ప్రేమించిన ప్రేయసి తో పాటు ఆమె తమ్ముడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో ప్రేయసి తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.హైదరాబాద్ నగరంలోని( Hyderabad ) ఎల్బీనగర్ పరిధిలో ఉండే ఆర్టీసీ కాలనీలో హోమియోపతి వైద్యురాలు సంఘవి,( Sanghavi ) ఆమె తమ్ముడు పృధ్వీ( Prudhvi ) నివాసం ఉంటున్నారు.
అయితే తాజాగా ఆదివారం మధ్యాహ్నం రామంతపూర్ కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఈ అక్కాతమ్ములపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.శివకుమార్ కత్తితో పొడిచిన తర్వాత పృద్వి బయటకు పరుగులు తీసి చుట్టుపక్కల ఉండే వారికి విషయం చెప్పాడు.

క్షణాల్లో స్థానికులు ఇంటిలోకి ప్రవేశించి సంఘవిని బయటకు తీసుకొచ్చి, శివకుమార్ ను గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన సంఘవి, పృద్విని ఆసుపత్రిలో చేర్పించారు.నిందితుడు శివకుమార్ ను( Sivakumar ) అదుపులోకి తీసుకున్నారు.అయితే చికిత్స పొందుతూ పృద్వి ప్రాణాలు వదిలాడు.సంఘవి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

స్థానికులు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.గత కొంతకాలంగా సంఘవి – శివకుమార్ మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతోందని, పెళ్లి విషయం( Marriage ) మాట్లాడేందుకు వచ్చిన శివకుమార్ ఆగ్రహానికి లోనై ప్రేయసి తో పాటు ఆమె తమ్ముడు పై కత్తితో ( Knife ) విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.







