అమ్మమ్మ పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధమంటున్న అనసూయ.. షరతులు ఏంటంటే?

బుల్లితెరపై జబర్దస్త్ షోతో పాటు ఇతర షోలు చేయడం ద్వారా స్టార్ యాంకర్ గా పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ( Anchor anasuya ) ప్రస్తుతం బుల్లితెర షోలకు దూరంగా ఉంటున్నా వెండితెరపై మంచి పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలను అందుకుంటున్నారు.పెదకాపు1 సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్న అనసూయ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కథ, పాత్ర అద్భుతంగా ఉంటే అమ్మమ్మ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమేనని చెప్పుకొచ్చారు.

అందరూ మాట్లాడుకునేంత గొప్పగా అమ్మమ్మ పాత్ర ఉంటే ఆ పాత్రలో చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమాలలో ఈ పాత్ర ఆ పాత్ర అని కాదని అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని నేను భావిస్తున్నానని ఆమె అన్నారు.కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్ లో అయినా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అనసూయ పేర్కొన్నారు.

తాను అమ్మమ్మ రోల్ లో నటించడానికి కూడా సిద్ధమేనని అయితే అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఆ పాత్ర ఉండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.పెదకాపు1 సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పానని అనసూయ కామెంట్లు చేశారు.ప్రతి రోల్ కు పెదకాపు1 సినిమా( Peddha Kapu 1 )లో మేకోవర్ ఉంటుందని ఆమె అన్నారు.

వైవిధ్యమైన రోల్ లో పెదకాపు1 సినిమాలో కనిపిస్తానని అనసూయ చెప్పుకొచ్చారు.

Advertisement

రంగస్థలం, విమానం ( Vimaanam movie )లాంటి సినిమాలలోని పాత్రలు తనకు మంచి పేరును తెచ్చిపెట్టాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.అనసూయ పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉందని అందుకే ఆమె బుల్లితెరకు దూరమయ్యారని టాక్ ఉంది.వెండితెరపై వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న అనసూయకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది.

అనసూయ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు