పెరిగిన కాలుష్యం, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాల కారణంగా ఈరోజుల్లో చాలా మంది 30 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొంటున్నారు.ముడతలు, చారలు, చర్మం సాగటం, కాంతిహీనంగా మారడం వంటివి యవ్వనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంటాయి .
దీంతో అద్దంలో చూసుకున్న ప్రతిసారి లోలోన కృంగిపోతూ ఉంటారు.కానీ చింతించకండి.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని వారానికి జస్ట్ రెండు సార్లు పాటిస్తే చాలు 60 లోనూ మీ చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మెరిసిపోతుంది.మరి ఇంతకీ ఆ సింపుల్ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
కాఫీ పౌడర్( Coffee powder ) ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో పక్కన పెడితే.చర్మ సౌందర్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది.యవ్వనాన్ని కాపాడుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemonade ), రెండు టేబుల్ స్పూన్ల తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి జస్ట్ రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
ముడతలు చారలు వంటివి దూరం అవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.
వయసు పైబడిన సరే స్కిన్ యవ్వనంగా గ్లోయింగ్ గా మెరుస్తుంది.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టోన్ ( Skin Tone )సైతం ఇంప్రూవ్ అవుతుంది.
కాబట్టి 60 లోనూ యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.