సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch ) ఉంది అనే సంగతి మనకు తెలిసిందే అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఏ రంగంలో అయినా కూడా మహిళలకు ఈ విధమైనటువంటి లైంగిక వేధింపులు ఉంటాయి అయితే మన ఆలోచన ధోరణి వ్యవహార శైలి బట్టి అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటామా లేదా అన్నది తెలుస్తుంది.అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.
అయితే తాజాగా సినీ నటి, జబర్దస్త్ యాంకర్( Jabardasth Anchor ) అనసూయ ( Anasuya ) క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.అనసూయ ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.అయితే తన వద్ద ఎవరైనా పరోక్షంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఎవరైనా సినిమా గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు వారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనే విషయాలు మూడు నిమిషాల్లోనే అర్థమవుతుందని ఈమె తెలిపారు.అలా వారు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనిపించినప్పుడు నేను వెంటనే నా భర్త పిల్లల గురించి మాట్లాడటం మొదలు పెడతానని తెలిపారు.నేను అలా మాట్లాడేసరికి వారు కూడా ఆ విషయం గురించి మాట్లాడరని ఈమె తెలిపారు.
మనం ఇండస్ట్రీలో కొనసాగుతూ మన ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి అంటే ఎవరితో వివాదాలు పెట్టుకోకూడదు.లౌక్యంగా మాట్లాడి తప్పుకున్నప్పుడు, భవిష్యత్ లో వారు ఎదురైనా కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాదని అనసూయ ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.