బుల్లితెర ప్రేమ జంటగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శివకుమార్( Shiva Kumar ) ప్రియాంక జైన్( Priyanka Jain ) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ మౌనరాగం సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు.
ఇక ఇటీవల ఈమె బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి వెళ్లి వచ్చి మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ప్రియాంక జైన్ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు.తాము హైదరాబాద్ లో( Hyderabad ) ల్యాండ్ కొన్నామని విషయాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.
గత కొద్దిరోజులుగా తాము అదే ఇంట్లో ఉంటున్నామని అయితే సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవాలని అనుకున్నాము కానీ ఫ్లాట్ కాకుండా భూమి కొని అక్కడ ఇల్లు కట్టించుకుంటే బాగుంటుందని ఆలోచించాము.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా తాము ల్యాండ్ కోసం వెతుకుతున్నామని అయితే అప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తుందని భూమి సరిపోతే రేట్ ఎక్కువగా ఉంటుందని రేట్ నచ్చితే పేపర్లు సరిగా లేకుండా ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది.ఫైనల్లీ మేము భూమి కొన్నామని ఈ సందర్భంగా ప్రియాంక శివకుమార్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ షేర్ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







