అంత పెద్ద పిల్లల ముందు ఇలాంటి పనులు అవసరమా మేడం

జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ( Anchor Anasuya ) మరో సారి సోషల్ మీడియా లో విమర్శలు ఎదుర్కొంటుంది.ఇటీవల హాలి డే కోసం ఫ్యామిలీ తో కలిసి ట్రిప్పు వెళ్లిన అనసూయ పిల్లల తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసింది.

 Anasuya Getting Trolls About Her New Photos , Jabardast, Anasuya, Flim News, Tal-TeluguStop.com

ఆ సందర్భంగా అనసూయ బికినీ ధరించి ఉండడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.అది ఫుల్ బికినీ కానప్పటికీ స్విమ్మింగ్ డ్రెస్( Swimming dress ) అయినప్పటికీ ఎదిగిన కొడుకుల ముందు ఒక తల్లి అలాంటి డ్రెస్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు అనసూయ ని ట్రోల్స్ చేస్తున్నారు, తల్లి కొడుకులు అన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేస్తే ఏంటి అంటూ కొందరు అనసూయ కు మద్దతు గా నిలుస్తున్నారు.

మొత్తానికి ఎప్పటి లాగే అనసూయ అభిమానులు మరియు అనసూయ ని వ్యతిరేకించే వారు సోషల్ మీడియా లో నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు.

అనసూయ ప్రతి విషయం లోనూ ఈ విధంగానే ట్రోల్స్ కి గురి అవుతుంది పాపం.ఆమె ఏ పని చేసినా కూడా కొందరు కావాలని పని కట్టుకొని విమర్శించడం మొదలు పెడుతున్నారు.ఇక అనసూయ జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమాన్ని వీడడం పట్ల ఇప్పటికి కూడా అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆమె వీలుంటే మళ్ళీ జబర్దస్త్ లో అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కానీ ఇప్పటికే అక్కడ ఆమెకు తలుపులు మూసుకు పోయాయి.ఆమె ఇతర చానల్స్ లో కనిపించాలనుకున్నా కూడా ప్రయోజనం లేదు.ఇక ఆమె పూర్తిగా సినిమా లకు పరిమితం అవ్వాల్సిందే.చిన్నా చితకా సినిమా ల్లో చేయాల్సిందే.

పెద్ద సినిమా ల్లో చిన్న పాత్రలు చేసుకుంటూ ఆమె కెరియర్ లో ముందుకు సాగాల్సిందే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube