టాలీవుడ్ హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తనదైన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతుంది.బుల్లితెరపై హాట్ అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వస్తోంది.
ఇక ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో మాట్లాడుతూ సందడి చేస్తుంది.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా అనసూయ ఇంటివద్దనే ఉంటూ తన కుటుంబంతో గడుపుతోంది.
అయితే కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయని, తాను మూడు ప్రాజెక్టులను ఓకే చేశానని, అవి షూటింగ్ జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డాయని ఆమె తెలిపింది.ఇలా కరోనా మహమ్మారి అనేకమంది ఉపాధిని దెబ్బతీసిందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో అనసూయ నటించనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో దేవదాసి పాత్రలో అనసూయ నటించనున్నట్లు తెలుస్తోంది.
మరి అనసూయ ఒప్పుకున్న ఆ మూడు ప్రాజెక్టులు ఏమిటనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు.