ఆనంద్ మహేంద్ర ( Anand Mahindra ) పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.మహేంద్ర గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఈయన ఎన్నో వ్యాపారాలను చేపడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆనంద్ మహేంద్ర తరచూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమాల పైన క్రీడారంగం పైన స్పందిస్తూ ఆయన చేసే పోస్టులు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి.అయితే ఇలా ఎప్పుడూ ఆనంద్ మహేంద్ర పేరే మనం వింటూ ఉంటాము కానీ ఆయన భార్య ఎవరు? ఆయన వారసులు ఎవరు అన్న విషయాల గురించి పెద్దగా ఎవరికి తెలియదు.
ఆనంద్ మహేంద్ర అనురాధ( Anuradha ) అనే ఒక జర్నలిస్టును పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి దివ్య ( Divya) రెండో అమ్మాయి ఆలిక (Aalika).ఇక వీరిద్దరూ కూడా ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు అయితే వీరిద్దరూ ఏం చేస్తారు ఏంటి అనే విషయానికి వస్తే.ఆనంద్ మహేంద్ర పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్త అయినప్పటికీ తన కుమార్తెలు మాత్రం తన వ్యాపారాలను వారసత్వంగా కొనసాగించలేదు.
ఈ విషయంలో వీరిద్దరూ చాలా విభిన్నం అని చెప్పాలి.ఆనంద్ మహేంద్ర కుమార్తెలు తన తండ్రి బాటలో కాకుండా తల్లి బాటలో నడుస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
అనురాధ పెళ్లి కాకముందు నుంచే జర్నలిస్ట్ ఈమె వెర్వ్ ,మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్ గా పని చేసేవారు.వివాహానికి ముందే అనురాధ వెర్వ్ పత్రికను స్థాపించారు.వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.ఆ తర్వాత ఈమె పలు సంస్థలలో ఫ్రీ లాన్సర్ గా పని చేశారు.16వ సంవత్సరం నుంచి ఆమె తన తల్లి స్థాపించినటువంటి వెర్వ్ పత్రికలో ఆర్ట్ డైరెక్టర్ గా చేరారు.ఇక చిన్న కుమార్తె కూడా ఇదే పత్రికలో ఎడిటోరియల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఇలా ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురులుగా గుర్తింపు పొందినటువంటి వీరిద్దరూ తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకోకుండా తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.ఇక వీరిద్దరూ కూడా విదేశీ వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకోవడం విశేషం.
ఇలా ఆనంద్ మహేంద్ర కూతుర్లుగా గుర్తింపు పొందినప్పటికీ వీరిద్దరూ విభిన్న దారిలో ప్రయాణిస్తూ తన తండ్రి పేరు ప్రఖ్యాతలు వారిపై పడకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.