తమ్ముడు దేవరకొండ 'హైవే' యాత్ర కూడా నిరాశ పర్చిందా!

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా హైవే అనే సినిమా రూపొందింది.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

సినిమాకు సంబంధించిన పోస్టర్స్ మరియు ఫస్ట్‌ లుక్‌ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించాయి.సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు భావించారు.

కానీ అనూహ్యంగా ఆనంద్ దేవరకొండ నటించిన హైవే సినిమా థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఓటీటీ లో ఈ సినిమా కు మంచి స్పందన వస్తుందని భావించారు.

ఆహా లో స్ట్రీమింగ్‌ అయిన హైవే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగింది.సినిమా లో ఒక సైకో కిల్లర్‌ ను చూపించారు.

Advertisement

ఆ కిల్లర్ ఎందుకు.ఎప్పుడు మనుషులను చంపేస్తున్నాడో అర్థం కాక ప్రేక్షకులు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి.

హైవే సినిమా ను ప్రేక్షకులు పెద్దగా ఆధరించే అవకాశాలు కనిపించడం లేదు.ఆనంద్‌ దేవరకొండ ఎందుకు ఇలాంటి సినిమా లను కమిట్‌ అవుతున్నాడో అర్థం కావడం లేదు అంటూ కొందరు జుట్టు పీక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఆ సినిమా లో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు.

ఒక వైపు అన్నయ్య విజయ్ దేవరకొండ లైగర్‌ వంటి భారీ పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఇప్పుడు హైవే సినిమా తో ఆనంద్ దేవరకొండ విడ్డూరంగా ఉందంటూ దేవరకొండ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తమ్ముడు దేవరకొండ సినిమా ల ఎంపిక విషయం లో ఎందుకు విజయ్ దేవరకొండ జోక్యం చేసుకోవడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఆనంద్ దేవరకొండ హైవే సినిమా తో మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ముందు ముందు అయినా ఈయనకు సక్సెస్ దక్కేనా చూడాలి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు