అమృత ప్రణయ్ ఈ పేరు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.ఈమె ఒక సెలబ్రిటీ కాకపోయినా ఈమె చుట్టూ జరిగిన పరిణామాలు ఈమెను ఒక సెలబ్రిటీ గా మార్చేశాయి.2018 మిర్యాలగూడలో ప్రణయ్ గురించి మనకు తెలిసిందే.అమృత తన కన్నా తక్కువ స్థాయి అతనిని పెళ్లి చేసుకుందన్న ఉద్దేశంతో అది నచ్చని అమృత తండ్రి మారుతీరావు పథకం ప్రకారం ప్రణయ్ ను హత్య చేయించాడు.
అప్పటి నుంచి అమృత పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
కళ్ళ ముందే తన భర్తను అంత దారుణంగా నరికి చంపడంతో తన తండ్రిపై తీరని పగ పెంచుకున్న అమృత తన తండ్రిని కటకటాల వెనక్కి తోసింది.
అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన మారుతి రావు లాడ్జిలో ఆత్మహత్య చేసుకుని మరణించారు.ఇక భర్త మరణం తర్వాత తల్లిదండ్రులను ఎదిరించి అత్తమామల దగ్గరే ఉంటున్నా అమృత తన భర్త మరణించిన నాలుగు నెలలకు ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇలా అత్తమామల దగ్గరే ఉంటున్న అమృత సడన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో సాంగ్ లో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

దీపావళి పండుగ సందర్భంగా యాంకర్ లాస్య ఒక యూట్యూబ్ వీడియో సాంగ్ షేర్ చేశారు.ఇందులో లాస్య కొడుకు జున్నుతో పాటు తన భర్త మంజునాథ్ ఉండడమే కాకుండా మధ్యలో అమృత ప్రణయ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.దీన్ని బట్టి చూస్తుంటే అమృత ఇకపై తన కెరీర్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తనను నటిగా రావాలని ఆలోచనలో ఉందని పలువురు భావిస్తున్నారు.ఏది ఏమైనా అమృత తన బాధలను మర్చిపోయి ఇలా బయటికి రావడం పట్ల కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.