అంబేద్కర్ రూపొందించిన పటిష్ట రాజ్యాంగమే అమరావతిని నిలబెట్టింది- టి‌డి‌పి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.

ఆర్ అంబేద్కర్ పటిష్టంగా రూపొందించి రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయ వ్యవస్థ ద్వారానే అమరావతి విచ్ఛిన్నం కాకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కాపాడిందని, హైకోర్టు తీర్పు వైకాపా నాయకులకు చెంపపెట్టు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొన్నూరు మాజీ ఎం‌ఎల్‌ఏ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు.

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ నాయకత్వంలోని పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ పొన్నూరు ఐల్యాండ్ సెంటర్ లోని డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.ఈసందర్బంగా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి మాత్రమేనని, అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చట్టబద్దమని హైకోర్ట్ ఈ తీర్పు ద్వారా స్పష్టంచేసిందని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి ముప్పై వేల ఎకరాలకు పైగా కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన, ఆయన పార్టీ నాయకులు రైతుల త్యాగాలను అవమానించేలా మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.వైకాపా నాయకులు ఎన్ని అవమానాలు చేసినా రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో 805 రోజులుగా పోరాటం చేస్తున్నారని చెప్పారు.

ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆప్రాంత ప్రజల త్యాగాలను గుర్తించకపోగా వారిని ఆవేదన ఆక్రందనకు గురిచేసిందని, దోపిడీలు, దౌర్జన్యాలను ప్రేరేపించిందని నరేంద్ర కుమార్ చెప్పారు.ప్రభుత్వం రైతుల ఆవేదన వినకపోవటంతో న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపట్టగా అన్నీ ప్రాంతాల ప్రజలు వారి అడుగులో అడుగేసి సంఘీభావం తెలియజేశారని, అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమని చెప్పిన నేతల ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ పాదయాత్ర కొనసాగిన అన్ని ప్రాంతాలలో అన్నివర్గాల ప్రజలు వారి అడుగులో అడుగేసి అపూర్వ మద్దతు ప్రకటించారని అన్నారు.

Advertisement

అమరావతి ఉద్యమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఉద్యమమని పాదయాత్రతోనే రుజువయ్యిందని చెప్పారు.న్యాయస్థానాలలో జడ్జిలను ప్రభావితం చేసే విధంగా పిటీషన్లు వేసి జడ్జీలను కూడా ప్రభావితం చేయాలని చూసినా హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చి న్యాయాన్ని నిలబెట్టిందని అన్నారు.

కోర్టు తీర్పు తరువాత కూడా మంత్రి బొత్స సత్తిబాబు, వైకాపాకు చెందిన కొందరు పవర్ బ్రోకర్లు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పటం వారి అహంకార పూరిత దొరణికి నిదర్శనమని తెలియజేశారు.డా|| బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన పటిష్టమైన రాజ్యాంగం ఉండటం వల్లే అమరావతి రాజధానిగా ఉందని, హైకోర్ట్ విస్పష్ట తీర్పు నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం రాజధాని పనులు చేపట్టే విధంగా ముందుకు రావాలని, ప్రజల ఆకాంక్షలను గౌరవించి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ, రూరల్ టి‌డి‌పి అధ్యక్షులు పటాన్ అహ్మద్ ఖాన్, బొర్రు రామారావు, మాజీ ఏయంసి ఛైర్మన్ మాదల వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆకుల సాంబశివరావు, పలువురు సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎం‌పి‌టి‌సిలు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు