ట్విట్టర్ బ్లూ టిక్ తొలగింపుపై స్పందించిన అమితాబ్... కాళ్లు పట్టుకోమంటారా అంటూ కామెంట్స్!

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్( Twitter ) బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ ఉండాలంటే.యూజర్స్ దానిని సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా కొనుగోలు చేయాలంటూ.

ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్  ప్రకటించాడు.ఇలా సబ్స్క్రైబ్ చేయనీ వారికి మాత్రమే బ్లూ టిక్ ఉంటుందని అనంతరం వాటిని తొలగిస్తాము అంటూ ముందుగానే హెచ్చరించారు.

అయితే కొంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకోగా మరికొందరు నిర్లక్ష్యం చేశారు.అయితే ట్విట్టర్ హెచ్చరించిన విధంగానే సబ్స్క్రిప్షన్ చేసుకొని సెలబ్రిటీలకు బ్లూటిక్ తొలగించింది.

ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలకు బ్లూ టిక్ తొలగించింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి వారికి కూడా బ్లూటిక్ తొలగించింది.అయితే ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విషయం గురించి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయం గురించి మాట్లాడుతూ…. ట్విట్టర్ బ్రదర్ వింటున్నావా? నేను సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు చెల్లించాను.కాబట్టి నా బ్లూ టిక్ ( Blue Tik )ని తిరిగి నాకు ఇవ్వండి అది ఉంటేనే నేను అమితాబచ్చన్ అని నన్ను గుర్తిస్తారు.

ఈ విషయంలో నేను మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను… లేకపోతే మీ కాళ్లు కూడా పట్టుకోమంటారా అంటూ ఫన్నీగా అమితాబ్ చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube